మార్కెట్ కమిటీ ఛైర్మన్‌పై దాడి.. నలుగురిపై కేసు నమోదు
SRCL: వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రొండి రాజుపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నాగాయపల్లికి చెందిన గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేష్‌లపై వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, గోపు మధును ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు.