ఘనంగా బక్రీద్ పండుగ

NRPT: నారాయణపేట పట్టణంలో శనివారం బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు కలుసుకొని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డిఎస్పీ లింగయ్య, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పారు.