'డయేరియా వ్యాప్తిపై సమగ్ర నివేదిక ఇవ్వాలి'
SKLM: సంతబొమ్మాలి మండలం తాళ్లవలసలో డయేరియా వ్యాప్తి చెందిన నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఇవాళ తక్షణమే స్పందించారు. ఈ విషయమై ఆయన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి, గ్రామంలో నెలకొన్న పరిస్థితుల వివరాలను తెలుసుకున్నారు. డయేరియా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే గ్రామాన్ని సందర్శించి, సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.