ALERT: పిడుగులతో కూడిన వర్షాలు
AP: రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని చెప్పింది. కృష్ణ, NTR, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది.