VIDEO: నిర్మల్ డంప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం

VIDEO: నిర్మల్ డంప్‌యార్డ్‌లో అగ్ని ప్రమాదం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట, బర్కత్‌పుర, ప్రియదర్శిని నగర్ ప్రాంతాల ప్రధాన రహదారుల వెంట ఉన్న చెత్తకుప్పల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం పురపాలక సిబ్బంది జేసీబీ సహాయంతో చెత్తను ఒకేచోట చేర్చి ప్రత్యేక వాహనంలో తరలించారు. మంటలు అదుపులోకి రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.