ఆత్మహత్య కు పాల్పడుతున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

E.G: గోదావరిలో దూకి ఆత్మహత్య కు పాల్పడుతున్న ఓ వ్యక్తి (30)ను పోలీసులు ఇవాళ కాపాడారు. పెరవలి మండలానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకునేందుకు ధవళేశ్వరం బ్యారేజి వద్దకు వచ్చాడు. ఈ విషయాన్ని అతని భార్య 112 కు కాల్ చేసింది. దీంతో జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు ధవళేశ్వరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడారు.