శ్రీశైలం ఎమ్మెల్యేకు సీఎం అవార్డు
NDL: శ్రీశైలం నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన 'మొంథా' తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఇవాళ ఉండవల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డాకు ముఖ్యమంత్రి అవార్డును బహూకరించారు. వరద విపత్తులో తన కృషిని గుర్తించడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.