నేషనల్ గేమ్స్ కోచ్‌గా తణుకు పీడీ నియామకం

నేషనల్ గేమ్స్ కోచ్‌గా తణుకు పీడీ నియామకం

W.G: నేషనల్ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే అండర్ –19 ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్‌గా తణుకు మండలం మండపాక జడ్పీ పాఠశాల పీడీ సంకు సూర్యనారాయణ నియమితులయ్యారు. హరియాణాలో ఈనెల 27 నుంచి 30 వరకు జరిగే ఈ పోటీలకు ఆయనను నియమిస్తూ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు అందినట్లు హెచ్ఎం ఫణిశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సూర్యనారాయణను అభినందించారు