కార్యాలయంలో అధికారులకు అత్యవసర సమావేశం

KMR: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని సూచించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం గాంధారి మండల కార్యాలయంలో మండల అధికారులకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మురళి మాట్లాడుతూ.. అతిభారీ వర్షాలు ఉన్నందున అందరు మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు తీసుకోవలసిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.