బస్టాండ్‌లో ఏర్పాటును పరిశీలించిన ఆర్‌ఎం శ్రీరామ్

బస్టాండ్‌లో ఏర్పాటును పరిశీలించిన ఆర్‌ఎం శ్రీరామ్

KMM: శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఖమ్మం నూతన బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లను ఆర్‌ఎం శ్రీరామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కల్యాణానికి వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్సులు నిర్ణీత సమయానికి నడిచేలా చూడాలని రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.