భైంసాలో ప్రారంభమైన శోభాయాత్ర
NRML: భైంసాలో శ్రీరామ నవమి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని గోశాల నుంచి లీలా మైదాన్ వరకు ఈ యాత్ర కన్నుల పండువగా కొనసాగనుంది. జై శ్రీరామ్ నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగుతున్నాయి. యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కాషాయ జెండాలతో సందడి చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.