రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
VKB: కొట్‌పల్లి మండలంలో రోడ్డు భద్రత అవగాహన కల్పించేందుకు గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర పోలీసుల బృందం సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని చెప్పారు. మద్యంతాగి వాహనం నడపకూడదని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని తెలిపారు.