'గ్రామ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'
VKB: గ్రామ ప్రజలకు సేవ చేస్తూ గ్రామాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని సర్పంచ్ అభ్యర్థి పల్లవి రాజు ముదిరాజ్ పేర్కొన్నారు. మూడో విడత నామినేషన్లలో భాగంగా పూడూరు మండలం మేడిపల్లి సర్పంచి అభ్యర్థిగా పల్లవి రాజు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ పెద్దలు ప్రజలు ఆశీర్వదిస్తే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవ చేస్తానన్నారు.