జాతీయ లోక్ అదాలత్ వాయిదా.. ఎప్పుడంటే?

ఏలూరు జిల్లాలో మే 10న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ వాయిదా పడింది. లోక్ అదాలత్‌ను జూలై 5వ తేదీకి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ తెలిపారు. కక్షి దారులు సహకరించాలని ఆయన కోరారు. అదాలత్‌లో రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.