ఘనంగా అయ్యప్ప స్వామి పంబానట్టు
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండాలో అయ్యప్ప స్వామి పంబానట్టు కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఉత్సవ విగ్రహాన్ని వాడవాడలో తిరిగిస్తూ స్వామి నృత్యాలు, చెరువు వద్ద జలక్రీడలతో పంబానట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, డివిజన్ అధ్యక్షుడు భూకే రామన్న సహా పలువురు పాల్గొన్నారు.