నేడు గిద్దలూరులో పవర్ కట్
ప్రకాశం: గిద్దలూరు మండలంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారి శేషగిరిరావు తెలిపారు. ఈ అంతరాయం గిద్దలూరు, రాచర్ల (యడవల్లి సబ్స్టేషన్ పరిధి), కొమరోలు మండలాల్లో అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రజలు సహకరించాలన్నారు.