సీఎంకు నాగలిని బహుకరించిన ఆడే గజేందర్
ADB: బోథ్ నియోజకవర్గానికి మొదటిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శాలువాతో సన్మానించి ఆత్మీయంగా స్వాగతం పలికారు. అదేవిధంగా రైతు సంక్షేమానికి ప్రతీకగా ఆయనకు నాగలిని బహుకరించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను వివరించారు.