నేడు ఉచిత హోమియోపతి వైద్యశిబిరం

నేడు ఉచిత హోమియోపతి వైద్యశిబిరం

VSP: విశాలాక్షినగర్ పదోవార్డు పరిధిలోని ఇందిరానగర్ ఆనందమార్గ ఆశ్రమంలో మంగళవారం ఉచిత హోమియోపతి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు స్వామి సౌమ్యానంద అవదూత తెలిపారు. ఉదయం పదిగంటల నుంచి నిర్వహించనున్న ఈ శిబిరం వర్షాకాలంలో వచ్చే కాలానుగుణ వ్యాధులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించనున్నట్లు ఆయన తెలిపారు.