నూతన డయాలసిస్ పింఛనును పంపిణీ చేసిన సర్పంచ్
కృష్ణా: మోపిదేవి మండల పరిధిలోని కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన కోసూరు రేణుకరాణికు డయాలసిస్ పింఛను మంజూరు అయ్యింది. 1వ తేదీ కావడంతో శనివారం 15 వేల పింఛన్ నగదును అర్హురాలి ఇంటి వద్ద సర్పంచ్ అనూష అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకున్న వెంటనే కూటమి ప్రభుత్వంలో పింఛను మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.