గార్బేజ్ కలెక్షన్‌ను పరిశీలించిన కమిషనర్

అన్నమయ్య: రాజంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు కొలిమి వీధిలో చెత్త సేకరణను పరిశీలించారు. హోటళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణపై తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని, ప్లాస్టిక్ వాడకం వల్ల పరిసరాలకే కాకుండా ఆరోగ్యానికి కలిగే హానిపై అవగాహన కల్పించారు.