30.87 లీటర్ల మద్యం సీజ్ చేసిన ఎస్సై
NRPT: మాగనూర్ మండలంలోని నేరడగం గ్రామంలో విక్రమ్ దాబా దగ్గర మద్యం విక్రయిస్తున్నట్లు అక్రమ సిటింగ్ చేస్తున్నారన్న సమాచారం మేరకు SI అశోక్ బాబు ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు దాడి చేశారు. దాడిలో విక్రమ్ దాబా యజమాని విక్రమ్ వద్ద నుంచి రూ. 19,030 విలువ గల 30.87 లీటర్ల మద్యంను సీజ్ చేసి, అతనిపై కేసు నమోదు చేశారు.