నిషేధిత గుడుంబా పట్టివేత

ADB: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కుబీర్ మండలం సిరిపెల్లి తండాలో మంగళవారం పోలీసుల దాడుల్లో 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. జాదవ్ గోవింద్ అనే వ్యక్తి తన ఇంట్లో గుడుంబా తయారు చేసి విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేయగా రూ.3 వేల విలువ గల 10 లీటర్ల నిషేధిత గుడుంబా లభ్యమైనట్లు తెలిపారు.