సైన్స్ ఫెయిర్‌ను విజయవంతంగా నిర్వహించాలి: డీఈవో
హనుమకొండ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి నిర్వహించనున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను విజయవంతంగా నిర్వహించాలని DEO గిరిరాజ్ గౌడ్ అన్నారు. HNK DEO ఆఫీసులో సైన్స్ ఫెయిర్ నిర్వహణపై నిన్న సమావేశం నిర్వహించారు. 120 మంది ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.