శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి పూర్వ వైభవం

SRPT: నడిగూడెం మండలం సిరిపురం శ్రీ రంగనాయక స్వామి పురాతన దేవాలయం పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేవాదాయ శాఖ నుంచి మంజూరైన రూ. 50 లక్షల సిజిఎఫ్ నిధులతో గర్భగుడి గోపురం, ముఖ మండపం, సాలారం, ప్రహరీ గోడ, తలుపులు తదితర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు ధర్మకర్తల మండలి ఛైర్మన్ టి. రమేష్ శుక్రవారం తెలిపారు.త్వరలో దేవాలయానికి పూర్వ వైభవం రానుంది.