VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ అసంపూర్ణంగా ఉంది'
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ మొత్తం నిర్లక్ష్యంగా మారింది. రోడ్లు గుంతలతో నిండిపోవడంతో వర్షకాలంలో నీళ్లు నిల్వ ఉండి రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం లేకపోవడంతో దోమల ఉపద్రవం పెరిగి అంటువ్యాధులు వ్యాప్తి చెందే పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.