అయ్యప్ప పడిపూజలో పాల్గొన్న కేంద్ర మంత్రి
KNR: కరీంనగర్ మహాశక్తి దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కావేటి పరమేశ్వర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఆయన స్వామికి అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవంలో అయ్యప్ప మాల ధారణ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.