గౌడ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

నిర్మల్: జన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికైన కవ్వాల్ గ్రామానికి చెందిన గర్వందుల సత్య గౌడ్‌ను బుధవారం పొనకల్ గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సత్య గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఈ సందర్భంగా గౌడ సంఘ నాయకులు ఆకాంక్షించారు. మున్ముందు మరన్ని ఉన్నత పదవులు పొంది గౌడ సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.