మూడో రోజు రోజుకు చేరిన RTC కార్మికుల సమ్మె

మూడో రోజు రోజుకు చేరిన RTC కార్మికుల సమ్మె

NGKL: ఆర్టీసీని ప్రభుత్వ సంస్థలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. నాగర్‌ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 90 శాతానికి పైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది.