గొట్టిపాడు వద్ద రోడ్డు ప్రమాదం

గొట్టిపాడు వద్ద రోడ్డు ప్రమాదం

GNTR: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బోయపాలెం నుంచి సూర్యలంకకు వినాయక నిమజ్జనం కోసం బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి, గుంతల రోడ్డు కారణంగా అదుపుతప్పి కిందపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, క్షతగాత్రుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.