VIDEO: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

HNK: సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. మంగళవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవల నిమిత్తం ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంతమంది వస్తుంటారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.