బుధకలాన్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
MNCL: రానున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బెల్లంపల్లి మండలం బుధకలాన్ గ్రామంలో రూరల్ CI హనోక్ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. పత్రాలు సరిగ్గా లేని పలు వాహనాలను సీజ్ చేశారు. గ్రామాల్లో గుడుంబా, మద్యం అమ్మకాలు చేపట్టవద్దని హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా సహకరించాలని కోరారు.