గ్రామీణ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లోని డబ్బు మాయం

VKB: తాండూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బు మాయమైంది. ఖాతాదారు విశాలాక్షి డబ్బును తీసుకోవడానికి వెళ్తే ఖాతాలో లేకపోవడంతో బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఇచ్చిన పిర్యాదుతో విచారణ చేపట్టినట్లు తాండూరు DSP బాలకృష్ణారెడ్డి తెలిపారు. అదే బ్యాంకులోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.