VIDEO: విశాఖ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా
విశాఖలో 1.89 లక్షల కేజీల గో మాంసం అక్రమ రవాణా పట్టుబడింది. శొంఠ్యం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో భారీగా గో మాంసం నిల్వ ఉంచారు. స్థానికులు సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గో మాంసాన్ని సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గో మాంసం అక్రమ రవాణాపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.