వేసవిలో నీటి ప్రమాదాలపై సీఐ హెచ్చరిక
NDL: వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థులు చెరువులు, బావులకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆళ్లగడ్డ సీఐ యుగంధర్ సూచించారు. నీటి లోతు తెలియక చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారని, వారి కదలికలపై నిఘా ఉంచి, ప్రమాదకర జలాశయాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.