పెన్నా నదిలో చిక్కుకున్న యువకుడు.. మంత్రి ఆరా

పెన్నా నదిలో చిక్కుకున్న యువకుడు.. మంత్రి ఆరా

AP: నెల్లూరు భగత్‌సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో 14 మంది యువకులు చిక్కుకున్నారు. వారు పేకాట ఆడేందుకు రాత్రి పెన్నా నది మధ్యలోకి వెళ్లారు. అయితే వారిని ఒక్కసారిగా వరద నీరు చుట్టుముట్టింది. పోలీసు అధికారులు ఆ 14 మందిని కాపాడారు. పరిస్థితిపై అధికారులను మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుల ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు.