కొయ్యూరులో దట్టంగా కురుస్తున్న పొగమంచు
ASR: కొయ్యూరులో ఆదివారం ఉదయం పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం సుమారు 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. పొగమంచు అందాలు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లి మండలంలో ఆదివారం 7.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.