పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

BDK: కరకగూడెంలోని పీహెచ్‌సీ జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను కలియతిరిగిన ఆయన, రికార్డులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం డాక్టర్ రవితేజతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.