'రేపు ద్వారకా నగర్ వంతెన నిర్మాణానికి భూమిపూజ'

'రేపు ద్వారకా నగర్ వంతెన నిర్మాణానికి భూమిపూజ'

TPT: నాగలాపురం పరిధిలోని ద్వారకా నగర్ వద్ద అరుణా నదిపై వంతెన నిర్మాణానికి MLA కోనేటి ఆదిమూలం గురువారం భూమిపూజ చేయనున్నట్లు మాజీ MPP మురళీ తెలిపారు. దీనికోసం MLA రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఇది పూర్తయితే పిచ్చాటూరు, నాగలాపురం మండలాలకు అనుసంధానంగా రోడ్డు ఏర్పడుతుందని, 2 మండలాల ప్రజల చిరకాల కోరిక తీరుతుందన్నారు.