VIDEO: ఉల్లి రైతన్న కంట కన్నీరు
KDP: జమ్మలమడుగులో ఉల్లి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలపై పెట్టిన పెట్టుబడులు రాక సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో దిక్కుతోచక పంటలను దున్నేస్తున్నారు. ఉల్లి రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పిన మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.