VIDEO: పాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
KRNL: దేవనకొండలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎంపీడీవో జ్యోతి ఇవాళ సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి.. పదో తరగతి పరీక్షలను ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధగా రాయాలని సూచించారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ప్రోత్సాహించారు. అనంతరం వంటగదిని పరిశీలించి, భోజన నాణ్యతపై వివరాలు తెలుసుకుని, పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.