వైభవంగా అమ్మవారి వార్షికోత్సవ మహోత్సవాలు
CTR: పుంగనూరు పట్టణం తూర్పు మోగసాలలో శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ మూడవ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం ఆలయ ఆవరణంలో వేద పండితులు గణపతి, నవగ్రహ, చండీ హోమాలు నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూల విగ్రహానికి సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకించారు. అనంతరం వజ్రాలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.