ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడికి నిరసన

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆదివారం కర్లపాలెం మండల వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. కర్లపాలెం మండల కేంద్రంలోని ఐలాండ్ సెంటర్ వద్ద రహదారి పై టైర్లు తగలబెట్టి ధర్నా నిర్వహించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల అభిమానంతో ముందుకు సాగుతున్న జగన్ పై దాడికి పాల్పడటం కాదన్నారు. రానున్న ఎన్నికలలో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు.