'మన కడప-స్వచ్ఛ కడప' కార్యక్రమంలోMLA

కడప: నగరంలో ప్రతి డివిజన్ పరిశుభ్రంగా ఉండాలన్న సంకల్పంతో మున్సిపల్ అధికారులు 'మన కడప- స్వచ్ఛ కడప' కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. మురుగు కాలువలు, చెత్తనిర్వహణ, శానిటేషన్ పనులపై ఆయా డివిజన్లలోనే సమీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా నేడు కాగితాల పెంట 43వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి, మున్సిపల్, శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.