VIDEO: మాధవరం-1లో పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీలో సోమవారం పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పంచాయతీలోని మాధవరం-1, మహబూబ్నగర్, ఆలీనగర్ ప్రజలకు EORD మెహతాజ్ యాస్మిన్ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో ఉన్న తడి, పొడి చెత్తను వేరుచేసి హరిత రాయబారులకు అందించాలన్నారు. గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆమె సూచించారు.