ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్
NLG: నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం చర్లపల్లిలోని హాకా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో నిల్వ ధాన్యాన్ని పరిశీలించిన ఆమె కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లారీల కొరత లేకుండా సకాలంలో రవాణా జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.