స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కందుకూరు పట్టణంలోని ఏకలవ్య నగర్‌లో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన MLA ఇంటూరి నాగేశ్వరరావు, లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. ప్రభుత్వం పారదర్శక పాలన కోసం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల విధానం ప్రజలకు మరింత సౌలభ్యం కలిగిస్తుందని అన్నారు.