వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు
W.G: చట్టం ముందు అందరూ సమానమేనని, కొందరు వారి ఆర్థిక స్థితులు బాగోక న్యాయం పొందలేకపోతున్నారని తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రంజిత్ కుమార్ అన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని తణుకు పాతవూరులోని బీసీ బాలికల వసతి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.