విజయవాడలో భారీ వర్షాలు

విజయవాడలో భారీ వర్షాలు

NTR: విజయవాడలో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కాలనీలు నీట మునిగాయి. వన్ టౌన్ చెట్టు సెంటర్ లో వీధులపై నడుము లోతులో నీళ్లు నిలిచాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకి రాలేక జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుండపోత వర్షాలతో విజయవాడ రోడ్లు వాగుల్లా మారాయి. వన్ టౌన్ ఏరియాలో రైల్వే బ్రిడ్జి కింద రెండు బస్సులు, లారీ వరదలో చిక్కుకుపోయాయి.