పాలమూరులో జీవో 46‌పై బీసీ సంఘం నిరసన

పాలమూరులో జీవో 46‌పై బీసీ సంఘం నిరసన

MBNR: జీవో నంబర్ 46‌ను వ్యతిరేకిస్తూ పాలమూరు విశ్వవిద్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన జరిగింది. జీవో 46 బీసీల రాజకీయ అణచివేతకు ప్రయత్నమని సంఘం అధ్యక్షుడు తాయప్ప ఆరోపించారు. పార్టీపరమైన రిజర్వేషన్ల బదులు చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తదితరలు పాల్గొన్నారు.