నేడు డీ.సీ.ఎం.ఎస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న గొంప కృష్ణ

VZM: డీ.సీ.ఎం.ఎస్ ఛైర్మన్‌గా నియమితులైన గొంప కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నట్లు డీ.సీ.ఎం.ఎస్. బిజినెస్ మేనేజర్ సాయికుమార్ తెలిపారు. మధ్యాహ్నం 1 గంటలకు నగరంలోని డీ.సీ.ఎం.ఎస్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లాకు చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు.